nikhil: త‌న సిక్స్ ప్యాక్ ఫొటోను పోస్ట్ చేసిన హీరో నిఖిల్!

nikhil six pack image
షార్ట్స్‌లో చూడండి
లాక్ డౌన్ స‌మ‌యంలో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ అదే స‌మ‌యంలో జిమ్ లో కండ‌లు పెంచ‌డంపై దృష్టి పెట్టాడు. తాజాగా ఆయ‌న త‌న ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో అభిమానుల‌ను ఆకర్షిస్తోంది.

చొక్కా జిప్ తీసేసి త‌న సిక్స్ ప్యాక్ ను చూపిస్తూ ఆయ‌న స్టైల్ గా ఈ ఫొటో దిగాడు. కాగా, ప్ర‌స్తుతం ఆయ‌న చందు మొండేటి దర్శకత్వంలో చేసిన కార్తికేయ-2 సినిమా విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నాడు. అనంత‌రం, సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వంలో '18 పేజీస్' సినిమాలో న‌టించ‌నున్నాడు.
Go Back to Shorts
nikhil
Tollywood
Twitter
Viral Pics

More Telugu News