త‌న ఫిట్ నెస్ ట్రైన‌ర్ కు రేంజ్‌రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చిన ప్ర‌భాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న ఫిట్ నెస్ ట్రైన‌ర్ కు రేంజ్‌రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చిన ప్ర‌భాస్!

prabhas gives car gift
  • చాలా కాలంగా ఫిట్ నెస్ ట్రైన‌ర్ గా ల‌క్ష్మ‌ణ్
  • తాజాగా రూ.ల‌క్షల విలువైన కారు ఇచ్చిన ప్ర‌భాస్
  • ఫొటోలు దిగిన ల‌క్ష్మ‌ణ్ కుటుంబ స‌భ్యులు
త‌న‌ ఫిట్‌నెస్ ట్రైనర్‌కు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఖరీదైన బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్రభాస్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా లక్ష్మణ్ చాలా కాలం నుంచి ప‌నిచేస్తున్నాడు.  ఈ నేప‌థ్యంలో ప్రభాస్ లక్షల రూపాయలు విలువ చేసే రేంజ్‌రోవర్ కారును ఆయ‌న‌కు గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఆ కారుతో ల‌క్ష్మ‌ణ్ కుటుంబ‌స‌భ్యులు, ప్ర‌భాస్ ఫొటోలు దిగారు. కాగా, బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా పాప్యులారిటీని పెంచుకున్న ప్ర‌భాస్ అనంత‌రం సాహో సినిమాలో న‌టించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో మ‌రికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.  రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తోన్న రాధేశ్యామ్ సినిమా ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే విడుద‌లైంది.

Prabhas
Tollywood
car

More Telugu News