KTR: 1.23 కోట్ల రూపాయ‌ల విరాళాన్ని కేటీఆర్ కు అందించిన ఎంపీ నామా

nama gives funds to ktr
షార్ట్స్‌లో చూడండి
క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో రోగుల‌ను ఆదుకోవ‌డానికి వీలుగా అంబులెన్సుల కోసం విరాళాలు సేక‌రించేందుకు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క‌ శాఖ‌ మంత్రి కేటీఆర్ ఇచ్చిన‌ 'గిఫ్ట్ ఏ స్మైల్' పిలుపుకు విశేష స్పందన వ‌స్తోంది. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేత‌లు అంబులెన్సుల కోసం భారీగా విరాళాలు అందించారు. తాజాగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు 1.23 కోట్ల రూపాయ‌లను కేటీఆర్ కు అందించారు.

"గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సుల‌‌ కొనుగోలు కోసం ఖమ్మం ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు ఆరు అంబులెన్సుల కోసం 1.23 కోట్ల రూపాయ‌ల చెక్కును మంత్రి కేటీఆర్ గారికి అందజేశారు" అని కేటీఆర్ కార్యాల‌యం త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌క‌టించింది.
Go Back to Shorts
KTR
nama nageswarrao
TRS

More Telugu News