'దిశ.. ఎన్ కౌంటర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ!
Add ap7am to your home Screen

'దిశ.. ఎన్ కౌంటర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ!

1st look film poster of DISHA ENCOUNTER
  • హైదరాబాద్ శివార్లలో దిశ హత్యాచారం, దహనం
  • ఇదే కథాంశంపై తెరకెక్కుతున్న 'దిశ' చిత్రం
  • నవంబర్ 26న సినిమా విడుదల
హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడిన వారు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఇదే కథాంశంతో 'దిశ.. ఎన్ కౌంటర్' చిత్రం తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. 2019 నవంబర్ 26న ఒక యువతిని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, దహనం చేసిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్విట్టర్ లో తెలిపారు. సెప్టెంబర్ 26న టీజర్ విడుదలవుతుందని... నవంబర్ 26న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు.
Disha Movie
Tollywood
Poster
Ram Gopal Varma

More Telugu News