nandu: 'నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్‌ ననుకుంటున్నావా?' అంటూ నెటిజన్ కామెంట్.. హీరో నందు ఘాటు రిప్లై!

  • నందు హీరోగా 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా
  • నిన్న ఫస్ట్‌లుక్ విడుదల
  • నీ సినిమాకు కూడా అప్‌డేట్లు ఎందుకని నెటిజన్ ప్రశ్న
  • సూసైడ్ చేసుకునే వారికే సపోర్ట్ చేయరా? అంటూ నందు రిప్లై
nandu replay on netizen comment

నందు హీరోగా రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆ సినిమా యూనిట్ నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఓ నెటిజన్‌ చేసిన విమర్శలకు నందు ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

'సినిమాను నేరుగా విడుదల చెయ్యి బ్రో. దాన్ని చూసి చస్తాం. ఏదో పెద్ద సూపర్ స్టార్‌లా అప్డేట్ పోస్టులు ఎందుకు.. టైం బొక్క' అని ఓ నెటిజన్ విమర్శించాడు. దీనిపై స్పందించిన నందు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు.

'మళ్లీ నీలాంటివాళ్లే వచ్చి బంధుప్రీతి, తొక్క అంటూ మాట్లాడతారు. బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి సపోర్ట్ చేయాలి అని పోస్టులు పెడుతుంటారు. సూసైడ్ చేసుకుంటే తప్ప బ్యాక్‌గ్రౌండ్ లేనివాడికి సపోర్ట్ చేయని మీలాంటి బ్యాచ్‌కు దండం. నేను స్టార్‌ని అని ఎప్పుడు చెప్పుకోలేదు. నువ్వే ఇండైరెక్ట్ గా తలిగిస్తున్నావ్' అని సమాధానమిచ్చాడు. బాలీవుడ్‌ హీరో సుశాంత్ బంధుప్రీతి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే.

కాగా, 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాను విజయీభవ ఆర్ట్స్‌పై  ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్‌ ప్రకటించింది. పాత్రకు తగ్గట్లుగానే నందు లుక్‌ను ఆయన పుట్టిరోజు సందర్భంగా నిన్న విడుదల చేశారు.
         

More Telugu News