Vasantha Kumar: కరోనాతో మరణించిన ఎంపీ వసంతకుమార్ మహమ్మారి తీవ్రతను మార్చిలోనే గుర్తించారు... వీడియో వైరల్

Corona deceased MP Vasanthakumar previous video went viral
షార్ట్స్‌లో చూడండి
కన్యాకుమారి ఎంపీ, కాంగ్రెస్ నేత హెచ్.వసంతకుమార్ కరోనా బారినపడి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో మార్చి 20న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో వసంతకుమార్ ప్రసంగానికి సంబంధించినది. అప్పటికింకా లాక్ డౌన్ కూడా ప్రకటించలేదు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ ఓ జాతీయ విపత్తు అని పేర్కొన్నారు. కేంద్రం దీనిపై వెంటనే స్పందించాలని, ఈ వైరస్ మహమ్మారి దేశం మొత్తాన్ని దెబ్బతీయగలదని హెచ్చరించారు. ఈ క్రమంలో బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. నిత్యావసరాలకు తీవ్రమైన కొరత వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కరోనా ప్రభావాన్ని ఎంతో ముందుగానే ఊహించిన వసంతకుమార్ ఆ రక్కసికే బలికావడం బాధాకరం.


Go Back to Shorts
Vasantha Kumar
Corona Virus
National Disaster
India
Kanyakumari
Congress

More Telugu News