రాజధాని తరలింపు వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన హైకోర్టు... పవన్ సమాలోచనలు
- పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్న పవన్
- రేపు నేతలతో టెలి కాన్ఫరెన్స్
- ఆ తర్వాతే కౌంటర్ దాఖలుపై నిర్ణయం
ఈలోపు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పార్టీ నేతలతో రేపు టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలంటూ కార్యాలయ సిబ్బందికి స్పష్టం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాజధాని తరలింపు, ఇతర పరిణామాలపై పవన్ తన పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఆపై, రాజధాని తరలింపుపై కౌంటర్ దాఖలుకు నిర్ణయం తీసుకుంటారు.