Mohan Babu: వాడివల్లే నా రాజకీయ జీవితం నాశనమైంది: మోహన్ బాబు

  • వినాయకచవితి సందర్భంగా మోహన్ బాబు ఇంటర్వ్యూ
  • రాజకీయంగా ఎదగలేదన్న అసంతృప్తి ఉందని వెల్లడి
  • ఒకడు తనను మోసం చేశాడంటూ వ్యాఖ్యలు
Mohan Babu tells about his political career

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు వినాయకచవితి సందర్భంగా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తాను ఎదగలేకపోయానన్న అసంతృప్తి ఇప్పటికీ ఉందని తెలిపారు. ఒకడు మోసం చేసినందువల్లే తన రాజకీయ జీవితం నాశనం అయిందని అన్నారు. నమ్మక ద్రోహం చేశాడని, ఇద్దరం కలిసి ఓ వ్యాపార సంస్థ పెడితే మోసం చేశాడని వివరించారు. ఆ తర్వాత అతను సీఎం కూడా అయ్యాడని, చచ్చినపామును కొట్టకూడదు కాబట్టి వదిలేశానంటూ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News