KTR: 'ఈ ఆరుగురు అక్కాచెల్లెళ్లు అనాథలయ్యారు' అంటూ ట్వీట్.. స్పందించిన కేటీఆర్

ktr helps sisters in penchikal
షార్ట్స్‌లో చూడండి
ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల కష్టాలు తీర్చుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు తాజాగా ఒకరు ఓ ట్వీట్ చేశారు. 'పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామం తోటపల్లి రాజ్యం భూమి లేని ఓ నిరుపేద దళిత కూలి కుటుంబం ఇది' అంటూ అందులో పేర్కొన్నారు. గత సంవత్సరం అనారోగ్యంతో ఆ కూలీ మృతిచెందగా అతని భార్య కూడా గత వారం రోజుల క్రితం మృతి చెందిందని చెప్పారు.

వీరి ఆరుగురు ఆడ పిల్లలు అనాథలయ్యారని, తల్లిదండ్రులు మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఒకరు చేసిన ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. 'వారి బాగోగులను మేము చూసుకుంటాం' అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు. స్థానిక కలెక్టర్‌ను సంప్రదించి ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరిగేలా చూడాలని తన కార్యాలయ సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు.
Go Back to Shorts
KTR
TRS
Telangana

More Telugu News