Donald Trump: పెను ప్రమాదం నుంచి బయటపడిన ట్రంప్

  • ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ఘటన
  • పసుపు, నలుపు రంగులో ఉన్న డ్రోన్
  • దర్యాప్తు ప్రారంభించిన సీక్రెట్ సర్వీస్
Donald Trumps plane nearly hit by small drone

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎగురుకుంటూ వచ్చిన ఓ డ్రోన్ ఒకటి విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తోంది.

More Telugu News