నిన్న సాయంత్రం నుంచి భారీ వరద మధ్యే వ్యక్తి.. హెలికాఫ్టర్ తో వెళ్లి కాపాడిన ఐఏఎఫ్.. వీడియో ఇదిగో
- ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ సమీపంలో ఘటన
- ఓ చెట్టు కొమ్మను పట్టుకుని ఉండిపోయిన వ్యక్తి
- నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు అక్కడే
వరదలో తనను తాను రక్షించుకోవటానికి ఓ చెట్టు కొమ్మను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు అక్కడే ఉన్నాడు. దీంతో హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్న వైమానిక దళ సిబ్బంది తాడును కిందకు వదిలి అతడిని పైకి లాగి, కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో చిత్రీకరించారు.