ట్రంప్ కుటుంబంలో విషాదం... సోదరుడి కన్నుమూత
- అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన రాబర్ట్ ట్రంప్
- కొన్నినెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాబర్ట్
- ఆసుపత్రిలో తమ్ముడ్ని కడసారి పరామర్శించిన ట్రంప్
"రాబర్ట్ నా తమ్ముడు మాత్రమే కాదు, నాకు ఆప్త మిత్రుడు కూడా. తమ్ముడి జ్ఞాపకాలు నా మనసు నుంచి వీడిపోవు. రాబర్ట్ ఎంతో శాంత స్వభావి. నా లైఫ్ లో నేను హనీ అని పిలిచే ఏకైక వ్యక్తి రాబర్ట్ మాత్రమే. మళ్లీ కలుసుకుందాం తమ్ముడూ!" అంటూ విషాద ప్రకటన చేశారు. కాగా, రాబర్ట్ ట్రంప్ చివరి క్షణాల్లో ఉన్నారని వైట్ హౌస్ అధికారులు ట్రంప్ కు తెలియజేయగా, శుక్రవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి తమ్ముడ్ని కడసారి పరామర్శించారు.