మహేంద్ర సింగ్‌ ధోనీపై అభిమానుల ట్వీట్లు ట్రెండ్..

dhoni tweets on trending
  • #ThankYouMahi, #ThankYouDhoni హ్యాష్‌టాగ్‌లతో ట్వీట్లు
  • క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన నేపథ్యంలో ట్వీట్లు
  • చిరస్మరణీయ విజయాలను గుర్తు చేసుకుంటున్న అభిమానులు
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు #ThankYouMahi, #ThankYouDhoni అనే హ్యాష్‌టాగ్‌లతో చేస్తోన్న పోస్టులు ట్రెండింగ్‌లో నిలిచాయి.
                                            
     
     
           
            
ధోనీ గతంలో సాధించిన రికార్డులు, భారత్‌కు అందించిన చిరస్మరణీయ విజయాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. దేశ క్రికెట్‌లో ఓ శకం ముగిసిందని అంటున్నారు. ధోనీ కోసమే తాము క్రికెట్‌ను చూశామని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ధోనీతో పాటు సురేశ్ రైనా సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ధోనీ క్రికెట్‌లో దేశానికి అందించిన సేవలను కొనియాడుతున్నారు.
Go Back to Shorts
MS Dhoni
suresh raina
Cricket

More Telugu News