Bahubali: మంగోలియా టీవీలో ప్రసారం అవుతున్న ప్రభాస్ సినిమా

Bahubali to be telecast on Mangolia TV
షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినిమా స్టామినాకు ప్రతిరూపంగా నిలిచిన చిత్రం 'బాహుబలి'. తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ వేదికపై చాటిన సినిమా అది. మన సినిమాకు అంతర్జాతీయంగా అవార్డులను తెచ్చిపెట్టిన చిత్రం. రాజమౌళి దర్శక ప్రతిభకు, నిర్మాణపు విలువలకు నిదర్శనంగా లిచింది. ఆ సినిమాతో హీరో ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అతని మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అంతటి సంచలనాలకు మారుపేరైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై ఆయా దేశాల్లో ప్రదర్శితమైంది. తాజాగా ఈ చిత్రాన్ని మంగోలియా భాషలోకి కూడా అనువదించారు. మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగోలియాలోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడి TV-5లో రేపు (ఆగస్టు 16) ప్రదర్శిస్తున్నారు. ఆ దేశస్థులు తమ మాతృభాషలో ఆ విధంగా మన బాహుబలిని ఆస్వాదించనున్నారు. బాహుబలి జైత్రయాత్రలో ఇది కూడా భాగం కానుంది.  
Go Back to Shorts
Bahubali
Prabhas
Rajamouli
Mangolia

More Telugu News