అయోధ్య రామాలయాన్ని దర్శించుకుంటానన్న పాకిస్థాన్ క్రికెటర్
- అయోధ్య భూమిపూజపై సంతోషం వ్యక్తం చేసిన డానిష్ కనేరియా
- తాను ఒక హిందువునని ట్వీట్
- రాముడి మార్గంలో నడిచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తానని వ్యాఖ్య
డానిష్ కనేరియా ట్వీట్ పట్ల పలువురు నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు తగు జాగ్రత్తలు కూడా చెపుతున్నారు. ఇలాంటి ట్వీట్ చేసిన తర్వాత అప్రమత్తంగా ఉండాలని... పాకిస్థాన్ లో ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.