Amala Paul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Amala Paul signs for a web series
షార్ట్స్‌లో చూడండి
*  ఇప్పటికే ఓ హిందీ వెబ్ సీరీస్ లో నటిస్తున్న కథానాయిక అమలాపాల్ తాజాగా ఓ తెలుగు, తమిళ వెబ్ సీరీస్ ను కూడా ఒప్పుకుంది. తమిళంలో గతంలో వచ్చిన ఓ నవల ఆధారంగా ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తున్నట్టు సమాచారం.  
*  ఆమధ్య హిందీలో వచ్చిన 'ఆర్టికల్ 15' చిత్రానికి మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన పాత్రను అడివి శేష్ పోషిస్తాడని తెలుస్తోంది. డి.సురేశ్ బాబు దీనిని నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది.
*  'మగధీర', 'ఛత్రపతి', 'నాన్నకు ప్రేమతో' వంటి భారీ చిత్రాలకు ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించిన రవీందర్ త్వరలో దర్శకుడిగా మారనున్నారు. ప్రస్తుతం 'రాధే శ్యామ్' చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న రవీందర్ ఈ చిత్రం తర్వాత మెగా ఫోన్ పట్టుకుంటారట. యూవీ క్రియేషన్స్ నిర్మించే చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తారని సమాచారం.
*  గతంలో మహేశ్ బాబు, సమంత జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' హిట్ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Amala Paul
Adivi Sesh
Mahesh Babu
Samantha

More Telugu News