Air Asia: రాంచీలో విమానానికి పక్షి తగలడంతో అత్యవసరంగా నిలిపివేత

Air Asia plane stopped immediately after a bird hit while take off
షార్ట్స్‌లో చూడండి
కోజికోడ్ లో రన్ వే నుంచి పక్కకు జారిన విమానం లోయలో పడిన దుర్ఘటన యావత్ దేశాన్ని నిర్ఘాంతపరిచింది. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అప్రమత్తత కనిపిస్తోంది. తాజాగా రాంచీ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. విమానం ఈ ఉదయం టేకాఫ్ తీసుకుంటుండగా పక్షి తగిలింది. దాంతో విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పినట్టయింది. ఈ విమానం ఝార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి ముంబయి వెళ్లాల్సి ఉంది. కాగా, సాంకేతిక నిపుణులు విమానానికి మరోసారి తనిఖీలు నిర్వహించిన అనంతరం విమానం ముంబయి పయనమవుతుంది.
Go Back to Shorts
Air Asia
Plane
Bird
Take Off
Ranchi
Mumbai

More Telugu News