జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది.. కొత్త రాజధాని అవసరమా?: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు
- అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే రూ. 80 వేల కోట్లు అవసరం
- సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా సరికాదు
- జగన్ రెఫరెండంకు వెళ్లాలి
అమరావతిలో రాజధాని వస్తుందని దాచుకున్న సొమ్ముతో మధ్యతరగతి ప్రజలు భూములు కొన్నారని రఘురాజు చెప్పారు. వారికి అన్యాయం చేయొద్దని కోరారు. అమరావతికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించడం మంచి పరిణామమని చెప్పారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ రెఫరెండంకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులను కూడా బెదిరిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులు తనకు కూడా ఎదురయ్యాయని చెప్పారు. న్యాయ వ్యవస్థపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని... దీనివల్ల ప్రభుత్వానికే నష్టమని అన్నారు.