48 గంటల డెడ్ లైన్ తర్వాత చంద్రబాబు తోకముడిచారు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

48 గంటల డెడ్ లైన్ తర్వాత చంద్రబాబు తోకముడిచారు: రోజా

Chandrababu mind is not working says Roja
  • జగన్ దమ్ము ఏంటో సోనియాను అడగాలి
  • చంద్రబాబు జూమ్ లో జూమ్ డ్యాన్స్  చేస్తున్నారు
  • అమరావతి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు
దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరిన చంద్రబాబు తోకముడిచి హైదరాబాదుకు పారిపోయారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. జగన్ దమ్ము ఏమిటో సోనియాగాంధీని అడగాలని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేస్తారని తాము భావించామని... అయితే దానికి భిన్నంగా ఆయన జూమ్ లో జూమ్ డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట ప్రజలూ లేరు, ఎమ్మెల్యేలూ లేరని చెప్పారు.

మూడు రాజధానులకు రాష్ట్ర ప్రజలంతా ఆమోదం తెలిపారని... జగన్ నిర్ణయాన్ని న్యాయస్థానం కూడా ఆశీర్వదిస్తుందని ఆశిస్తున్నట్టు రోజా తెలిపారు. అమరావతి రైతులు చంద్రబాబును నమ్ముకుంటే... వారిని నట్టేట ముంచేశారని అన్నారు. లోకేశ్ ను సీఎం చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు బుర్ర పని చేయడం మానేసిందని చెప్పారు. జగన్ మాదిరి లోకేశ్ గెలవడం అసాధ్యమని అన్నారు.
Roja
Jagan
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News