Sukumar: మరోసారి 'రంగస్థలం' కాంబినేషన్?

  • చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం'
  • ఆర్టిస్టుగా చరణ్ కి మంచి పేరు తెచ్చిన చిత్రం
  • చరణ్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సుక్కూ
Sukumar preparing script for Charan

రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' సినిమాకు ఓ ప్రత్యేకత వుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం చరణ్ ని విభిన్న కోణంలో ఆవిష్కరించింది. ఎప్పుడూ కమర్షియల్ మూస సినిమాలు చేసే చరణ్ కి ఆ పాత్ర ఓ ఛాలెంజ్ లా నిలిచింది. అతనిలోని అసలైన నటుడిని బయటకు తెచ్చింది. ఈ పాత్ర పోషణలో చరణ్ పడ్డ కష్టానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అలాగే అటు బాక్సాఫీసు వద్ద కూడా ఎంతో విజయాన్ని సాధించింది.

ఇప్పుడీ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీతో 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్న సుకుమార్ ఈ లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఖాళీ సమయంలో ఓ స్క్రిప్టుపని కానిస్తున్నాడట. చరణ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథను ఆయన సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే కనుక, బహుశా 'పుష్ప' తర్వాత సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని చరణ్ తోనే చేసే అవకాశం వుందని సమాచారం!

More Telugu News