విశాఖలోని ఫార్మా కంపెనీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
- అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు
- భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు
- పలు వాహనాలు ధ్వంసం
- మంటలను అదుపుచేసిన సిబ్బంది
ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి అక్కడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండడంతో దాని ద్వారా అక్కడి సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.