మోహన్‌బాబు ఇంట్లోకి వెళ్లి బెదిరించింది వీరే.. పీఎస్‌కు వచ్చిన యువకుల తల్లిదండ్రులు
- మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన నలుగురు యువకులు
- రాఘవేంద్ర, ఆనంద్, గౌతమ్, డేవిడ్‌గా గుర్తింపు
- ఫాంహౌస్ చూడడానికే తమ పిల్లలు వెళ్లారన్న తల్లిదండ్రులు
- దాడి చేయడానికి వెళ్లలేదని వ్యాఖ్య
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ యువకుల తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఫాంహౌస్ చూడడానికే తమ పిల్లలు అక్కడికి వెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంతేగానీ, దానిపై దాడి చేయడానికి వెళ్లలేదని వారు వివరించారు. అయితే, దారి తప్పి మోహన్‌బాబు ఫాంహౌస్‌కి వెళ్లి ఉండొచ్చని కూడా వారు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.