నితిన్! ఇంకా పార్టీ బాకీ ఉంది మాకు: నిఖిల్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్! ఇంకా పార్టీ బాకీ ఉంది మాకు: నిఖిల్‌

Nikhil comment on nitin marriage
  • పెళ్లి  చేసుకున్నందుకు శుభాకాంక్షలు
  • మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు
  • కానీ, ఇంకా పార్టీ బాకీ ఉంది మాకు
  • కరోనా విపత్తు ముగిశాక వదిలేది లేదు పార్టీ 
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన ప్రియురాలు షాలినిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ పెళ్లి జరిగింది. దీంతో పెళ్లికి పరిమిత సంఖ్యలో బంధువులు, మిత్రులను ఆహ్వానించారు. పెళ్లి సందర్భంగా నితిన్‌ తన స్నేహితులకు పార్టీ కూడా ఇవ్వలేకపోయాడు.

ఈ విషయంపై యంగ్‌ హీరో నిఖిల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవని పేర్కొన్నాడు.  'నితిన్ బ్రదర్‌... పెళ్లి  చేసుకున్నందుకు శుభాకాంక్షలు.. మీరిద్దరు చూడముచ్చటగా ఉన్నారు.. జీవితాంతం మీరు సంతోషంగా, చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, ఇంకా పార్టీ బాకీ ఉంది మాకు. కరోనా విపత్తు ముగిశాక వదిలేది లేదు పార్టీ' అని నిఖిల్ పేర్కొన్నాడు. కాగా, ఇటీవలే నిఖిల్‌ కూడా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

మరోపక్క, నితిన్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. నితిన్-షాలిని జీవితాంతం సంతోషంగా ఉండాలని విషెస్ తెలుపుతున్నారు. నితిన్‌ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Nikhil
nitin
marriage

More Telugu News