Mahesh Babu: వైరల్ అవుతున్న మహేశ్ బాబు కామన్ డీపీ

Mahesh Babu birthday special common dp goes viral
  • ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో మహేశ్ బాబు కామన్ డీపీ రిలీజ్
  • ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న కాగా, సోషల్ మీడియాలో ఇవాళ్టి నుంచే వేడుకలు షురూ అయ్యాయి. ప్రత్యేకంగా రూపొందించిన మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్ కామన్ డీపీ (డిస్ ప్లే పిక్చర్) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాయంత్రం కామన్ డీపీ రిలీజ్ చేయగా, అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, రీట్వీట్లతో దాన్ని సోషల్ మీడియాలో హోరెత్తించారు. మహేశ్ బాబు లేటెస్ట్ పిక్ తో కూడిన ఈ డీపీ మొత్తానికి అభిమానులకు మాంచి కిక్ ఇస్తోందనడంలో సందేహం లేదు.
Mahesh Babu
Common DP
Birthday
Viral
Tollywood

More Telugu News