కరోనా నుంచి కోలుకున్న వాళ్లు దయచేసి ప్లాస్మా దానానికి ముందుకు రావాలి: చిరంజీవి
- కరోనా రోగుల ప్రాణాలు నిలుపుతున్న ప్లాస్మా థెరపీ
- ప్లాస్మా దానం ప్రచారానికి చిరంజీవి మద్దతు
- దీన్ని మించిన మానవత మరొకటి ఉండదంటూ ట్వీట్
"కరోనా నుంచి కోలుకున్న అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను... దయచేసి మీ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రండి. తద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడండి. కరోనా కష్టకాలంలో ఇంతకుమించిన మానవతా సాయం మరొకటి ఉంటుందని అనుకోను. కరోనాను గెలిచిన యోధులారా, ఇప్పుడు మీరు రక్షకులు అవ్వాల్సిన తరుణం వచ్చింది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.