తెలంగాణలో మరో 1,430 మందికి పాజిటివ్
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 1,430 మందికి పాజిటివ్

Corona raise continue in Telangana
  • 47 వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • జీహెచ్ఎంసీ పరిధిలో మరో 703 మందికి కరోనా
  • ఇవాళ 2,062 మంది డిశ్చార్జి
తెలంగాణలో కరోనా రక్కసి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 1,430 కేసులు వెల్లడయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 703 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 117 కేసులు, మేడ్చల్ జిల్లాలో 105 కేసులు నమోదయ్యాయి. అటు రాష్ట్రంలో మరో 7 మరణాలు నమోదయ్యాయి. దాంతో మరణాల సంఖ్య 429కి పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న 2,062 మందిని నేడు డిశ్చార్జి చేశారు. ఇంకా 10,891 మంది చికిత్స పొందుతున్నారు.
Corona Virus
Telangana
Positive
Deaths
COVID-19

More Telugu News