Guntur: పాత గుంటూరు ఎస్సైపై స్థానికుల దాడి.. తీవ్ర గాయాలు!

Locals attacked Old Guntur SI
షార్ట్స్‌లో చూడండి
పాత గుంటూరు ఎస్సైపై స్థానికులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఎస్సై అమీర్ తన బృందంతో కలిసి పొన్నూరు రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి అది ముదిరింది. అనంతరం అమీర్ పై వారు భౌతికదాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, ఆయనను ఘటనాస్థలి నుంచి జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న డీఎస్పీ సీతారామయ్య ఘటనాస్థలికి వచ్చారు. స్థానికులను, ఇతర సిబ్బందిని అడిగి గొడవ గురించి ఆరా తీశారు.
Go Back to Shorts
Guntur
SI
Attack

More Telugu News