ఆనందంలో విక్రమ్ కుటుంబం.. త్వరలో తాత కాబోతున్న హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆనందంలో విక్రమ్ కుటుంబం.. త్వరలో తాత కాబోతున్న హీరో!

Actor Vikram is going to be a grand father
  • విక్రమ్ కు ఇద్దరు సంతానం
  • ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుమారుడు ధ్రువ్
  • త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న కుమార్తె అక్షిత
విలక్షణమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేమైన స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరో విక్రమ్, ఇప్పటికే తన కుమారుడు ధ్రువ్ ను కూడా హీరోగా పరిచయం చేశారు. తాజాగా ఆయనకు మరో ప్రమోషన్ రాబోతోంది. త్వరలోనే విక్రమ్ తాత కాబోతున్నాడు. తమ ఇంట్లో అడుగుపెట్టబోతున్న కొత్త తరం కోసం ఇంటిల్లిపాది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

విక్రమ్, శైలజ దంపతులకు ధ్రువ్ తో పాటు అక్షిత అనే కుమార్తె కూడా ఉంది. 2017లో అక్షితకు రంజిత్ తో వివాహం జరిగింది. త్వరలోనే అక్షిత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో, తమకు అత్యంత సన్నిహితులైన కొద్ది మంది సమక్షంలో సింపుల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.
Vikram
Tollywood
Kollywood

More Telugu News