Sri Reddy: రామ్ గోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం.. అందుకే ఆ సినిమాలో నటించలేదు: శ్రీరెడ్డి

  • 'పరాన్నజీవి' సినిమాలో నేను నటించలేదు
  • సినిమా కోసం నన్ను సంప్రదించిన మాట నిజమే
  • వర్మకు వ్యతిరేకంగా తీస్తున్న సినిమాలో ఎలా నటిస్తాను
I love Ram Gopal Varma says Sri Reddy

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రకమైన ఉత్కంఠభరితమైన పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. ఓ వైపు 'పవర్ స్టార్' పేరుతో రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టగా... మరోవైపు 'పరాన్నజీవి' పేరుతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్మకు వ్యతిరేకంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను కూడా విడుదల చేశారు.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. 'పరాన్నజీవి' చిత్రంలో శ్రీరెడ్డి కూడా నటించిందనేదే ఆ వార్త. ఈ అంశంపై ఆమె క్లారిటీ ఇస్తూ, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చెప్పింది. రామ్ గోపాల్ వర్మ అంటే తనకు చాలా ఇష్టమని... అలాంటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా తీస్తున్న సినిమాలో ఎలా నటిస్తానని ప్రశ్నించింది. ఈ సినిమా కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమేనని... కానీ, వర్మకు వ్యతిరేకంగా తాను నటించనని చెప్పింది.

More Telugu News