'ప‌వ‌ర్ స్టార్' నుంచి 'గడ్డి తింటావా?' పాట నేడు విడుదల.. ఆసక్తికర పోస్టర్లు విడుదల చేసిన వర్మ
Add ap7am to your home Screen

'ప‌వ‌ర్ స్టార్' నుంచి 'గడ్డి తింటావా?' పాట నేడు విడుదల.. ఆసక్తికర పోస్టర్లు విడుదల చేసిన వర్మ

new posters from power star
  • విడుదలకు సిద్ధమవుతున్న పవర్ స్టార్ సినిమా
  • సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఈ పాట విడుదల చేస్తానన్న వర్మ
  • ఫాంహౌస్‌లో త‌న గేదెలను ఉద్దేశించి హీరో పాట పాడతారు
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ 'పవర్ స్టార్'‌ పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆయన మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కనపడుతున్న పాత్ర నిజజీవితంలో ఎవరినైనా పోలి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్‌కు భక్తుడైన ఓ నిర్మాత కొబ్బరికాయ కొట్టి పట్టుకొస్తున్నట్లు ఉంది.  

అలాగే, ఈ సినిమాలోని 'గ‌డ్డి తింటావా?' అనే పాటను ఈ రోజు సాయంత్రం ఐదు గంట‌ల‌కు విడుద‌ల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలోని హీరో తన ఫాంహౌస్‌లో త‌న గేదెలు, చెట్లను ఉద్దేశిస్తూ ఈ పాట పాడతాడ‌ని వర్మ తెలిపారు. కాగా, ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల చేస్తానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. 

RGV
Tollywood
Pawan Kalyan

More Telugu News