Pawan Kalyan: పవన్-క్రిష్ సినిమా టైటిల్ పై అప్ డేట్

Krish to announce title of Pawan movie
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. తమ అభిమాన నటుడి సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచీ ఆ చిత్రం టైటిల్ గురించే ఆసక్తిగా చర్చించుకుంటూ వుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా హవా నడుస్తుండడంతో అభిమానులు తమకు తోచిన టైటిల్స్ ను అందంగా డిజైన్ చేసి, ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించే చిత్రం టైటిల్ పట్ల కూడా అభిమానుల్లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం టైటిల్ని పవన్ జన్మదినమైన సెప్టెంబర్ 2న ప్రకటించడానికి దర్శకుడు క్రిష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ కి హీరో బర్త్ డేను మించిన రోజు మరొకటి ఉండదని, ప్రేక్షకులలోకి బాగా చొచ్చుకుపోతుందని భావిస్తున్నారు. ఆ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారట. కాగా, ఈ చిత్రం కోసం 'విరూపాక్ష' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్యం పూర్వం నాటి కథతో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు. ఇదిలావుంచితే, మరోపక్క పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం బ్యాలెన్స్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని సమాచారం.
Go Back to Shorts
Pawan Kalyan
Krish
Vakeel Saab

More Telugu News