Flipcart: ఫ్లిప్ కార్ట్ లో మరో 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన వాల్ మార్ట్!

New Investment in Flipkart by Wal Mart
షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్టి, మెజారిటీ వాటాలను దక్కించుకున్న వాల్ మార్ట్, తాజాగా, మరో 1.2 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఫ్లిప్ కార్ట్, ఈ పెట్టుబడితో సంస్థ విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించింది.

2021 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా, ఈ పెట్టుబడి సంస్థకు రానుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. ఈ నిధులతో తమ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను కొనసాగిస్తామని, కరోనా కష్టాల నేపథ్యంలో ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఇండియాలో నానాటికీ విస్తరిస్తున్న వేళ, మరింత మార్కెట్ వాటాను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపింది.

కాగా, 2018లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో 70 శాతం వాటాలను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ స్టార్టప్ సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్, ఆపై ఇండియాలో అమెజాన్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. తాజా పెట్టుబడులతో సంస్థలో వాల్ మార్ట్ వాటా ఏ మేరకు పెరిగిందన్న విషయాన్ని మాత్రం ఫ్లిప్ కార్ట్ వెల్లడించలేదు.
Go Back to Shorts
Flipcart
Wal-mart
Investment

More Telugu News