సీఎం విజయ్ మీకు హ్యాట్సాఫ్.. అద్భుతమైన నిర్ణయం: నటుడు విశాల్

Actor Vishal praises CM Vijays decision to close liquor shops
  • రాష్ట్రవ్యాప్తంగా 717 మద్యం దుకాణాల మూసివేతకు సీఎం విజ‌య్‌ ఆదేశం
  • పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న షాపులు బంద్
  • విజయ్ నిర్ణయాన్ని ప్రశంసించిన నటుడు విశాల్
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్, అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే, రాష్ట్రవ్యాప్తంగా 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ తన తొలి సంతకం చేశారు. దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న ఈ మద్యం దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆయన తన తొలి ఉత్తర్వులో పేర్కొన్నారు.

విజయ్ నిర్ణయంపై ఆయన స్నేహితుడు, నటుడు విశాల్ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. "డియర్ సీఎం జోసెఫ్ విజయ్ గారు.. మీకు మా అభినందనలు. 717 వైన్ షాపులను, మరీ ముఖ్యంగా స్కూళ్ల దగ్గర ఉన్నవాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఆర్కే నగర్‌లో నాకు తెలిసిన ఒక విద్యార్థిని రోజూ మద్యం దుకాణం దాటుకుని ఇంటికి వెళ్లేందుకు చాలా భయపడేది. ఇప్పుడు ఆ అమ్మాయితో పాటు ఎంతోమంది సామాన్యులు మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటారు. ఈ నిర్ణయంతో ఎన్నో ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నాం. ఈ ఆనందం ఎప్పటికీ నిలిచిపోతుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి" అని విశాల్ ఆ పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijay Joseph
Tamil Nadu
Tamil Nadu CM
Vishal
Liquor shops closed
Wine shops closed
Tamil Nadu politics
School vicinity
AR Nagar
Joseph Vijay

More Telugu News