ap7am logo

'పవర్ స్టార్' నుంచి 'పవరొమాంటిక్' పోస్టర్‌ అంటూ ఆసక్తికర పోస్టర్ విడుదల చేసిన ఆర్జీవీ‌

Sat, Jul 11, 2020, 01:08 PM
A POWERomantic poster from POWER STAR
  • పవర్‌ స్టార్‌ పక్కన రష్యన్ మహిళ
  • ఒక్కో పోస్టర్‌ వదులుతోన్న వర్మ
  • సినిమాలోగోను కృష్ణ కార్తీక్ రూపొందించాడని వివరణ
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ పవర్‌ స్టార్‌ పేరిట ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రష్యన్ మహిళకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఈ రోజు విడుదల చేశారు. పవర్ స్టార్ సినిమా నుంచి 'పవరొమాంటిక్' పోస్టర్‌ ఇదిగో అంటూ ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు.

కాగా, 'పవర్ స్టార్' పేరిట తీస్తోన్న ఈ సినిమా లోగోలో వర్మ జనసేన పార్టీ గుర్తు గ్లాసు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చదివే పుస్తకాలను వాడుతోన్న విషయం తెలిసిందే. వీటిని ఎవరు డిజైన్ చేశారో వర్మ తెలిపారు. 'పవర్ స్టార్ సినిమాలోని ఈ గొప్ప వినూత్నమైన పోస్టర్లను గొప్ప నైపుణ్యాలున్న క్రియేటివ్ సైకో డిజైన్‌ చేశాడు' అని చెప్పారు. కృష్ణ కార్తీక్ అనే యువకుడు  ఈ పోస్టర్లను రూపొందించాడు. వాటిని తన సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేస్తున్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement