'పవర్‌ స్టార్‌' సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్‌ ను విడుదల చేసిన రామ్‌ గోపాల్ వర్మ
Add ap7am to your home Screen

'పవర్‌ స్టార్‌' సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్‌ ను విడుదల చేసిన రామ్‌ గోపాల్ వర్మ

RGV First look of POWER STAR
  • 'పవర్ స్టార్' పేరిట వర్మ సినిమా
  • త్వరలోనే ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల
  • 'జై పవర్‌ స్టార్' అని వర్మ కామెంట్
  • ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అని తెలిపిన ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' పేరిట సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ఇటీవలే ప్రకటించిన ఆయన ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేశారు.

'పవర్ స్టార్‌ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇదిగో.. ఈ సినిమా త్వరలోనే ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల కానుంది. జై పవర్‌ స్టార్' అని ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతి కథ అని ఆ పోస్టర్‌పై రాశారు. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్‌ పాత్రధారి అచ్చం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లా పోజు ఇచ్చాడు. నలుపు రంగు టీషర్ట్‌ వేసుకుని కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

కాగా, తాను తీస్తోన్న పవర్‌ స్టార్‌ సినిమా ఏ వ్యక్తికో చెందిన బయోపిక్ కాదని వర్మ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ ప్రారంభించి, ఎన్నికల్లో ఓడిన ఓ సినీ స్టార్‌కు ఎదురైన పరిణామాల గురించి కల్పిత కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని వివరణ ఇచ్చారు. ఈ సినిమా కథ, పాత్రధారి ఏ వ్యక్తినయినా పోలి ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని ప్రకటించారు.
RGV
Pawan Kalyan
Tollywood

More Telugu News