Corona Virus: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం

AP Govt issues new guidelines for corona
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేసుల నేపథ్యంలో ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో, ఆసుపత్రుల్లో రద్దీని తగ్గించేందుకు, అత్యవసరమైన చికిత్స అవసరమైన పేషెంట్లకు బెడ్లు ఖాళీగా ఉంచేందుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు ఇవే.

  • కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ... వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే 10 రోజుల పాటు చికిత్స చేసి ఇంటికి పంపిస్తారు.
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లినవారు... మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది.
  • వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లక్షణాలు లేని వారిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు.
  • కరోనా లక్షణాలు తక్కువగా ఉండి, ఆక్సిజన్ అవసరమైన వ్యక్తులను కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తారు. అక్కడ మూడు రోజుల్లో కరోనా లక్షణాలు తగ్గిపోతే... నాలుగో రోజు డిశ్చార్జి చేస్తారు.
  • వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని మాత్రం... పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇంటికి పంపుతారు. ఇలాంటి వారు కరోనా పూర్తిగా తగ్గేంత వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది.
  • మరోవైపు కోవిడ్ కోసం ప్రభుత్వం 1075 అనే హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది.
Go Back to Shorts
Corona Virus
New Guidelines
Andhra Pradesh

More Telugu News