Pawan Kalyan: పవన్ కల్యాణ్ 'వ‌కీల్‌సాబ్' నుంచి మరో పోస్టర్‌ లీక్‌

  • 'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద
  • సినిమా ప్రారంభంలో పవన్ లుక్ లీక్‌
  • పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్న లుక్‌ తాజాగా లీక్
  • పోస్టర్‌లో నటి అంజలి కూడా
pawan new movie poster leaks

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ నటిస్తోన్న 'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం సమయంలో పవన్ లుక్ బయటకు వచ్చి అది వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని మ‌రో లుక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సీన్‌లో పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నట్లు ఇందులో ఉంది.
               
ప‌వ‌న్‌ క‌ల్యాణ్ వాదనలు వినిపిస్తుండగా పక్కనే నటి అంజ‌లి కూర్చొని ఉంది. కోర్టులో వాదనలు వినడానికి వచ్చిన మరి కొందరూ ఇందులో కనపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో వైరల్ అవుతోంది.

కాగా,  బాలీవుడ్ సినిమా 'పింక్‌'కు రీమేక్‌గా వకీల్ సాబ్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. అంజ‌లితో పాటు నివేదా థామ‌స్  ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం పూర్తయింది.

More Telugu News