Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళంలో రష్మికకు భారీ ఆఫర్ 
  • మహేశ్ సినిమాలో ప్రముఖ నటుడు
  • నాలుగు భాషల్లో విశాల్ 'చక్ర' ట్రైలర్
Rashmika finalized for Vijays latest movie

*  తమిళ స్టార్ హీరో విజయ్ తన 65వ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాగా, ఇందులో కథానాయికగా రష్మిక మందన్న ఎంపిక దాదాపు పూర్తయినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
*  మహేశ్ బాబు, పరశురాం కాంబినేషన్ లో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో విలన్ పాత్రకు పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. నిన్నటి వరకు సుదీప్, ఉపేంద్ర పేర్లు ప్రచారంలో వుండగా, ఇప్పుడు కొత్తగా అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఆ పవర్ ఫుల్ విలన్ పాత్రకు అరవింద్ స్వామిని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
*  విశాల్ హీరోగా ఎమ్మెస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'చక్ర' చిత్రం టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రం ట్రైలర్ ను ఈ నెల 27న మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నారు. రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.    

More Telugu News