మహేశ్ బాబు బ్యానర్లో శర్వానంద్!
Add ap7am to your home Screen

మహేశ్ బాబు బ్యానర్లో శర్వానంద్!

Mahesh to produce a film with Sharwanand
  • మహేశ్ బాబు సొంత చిత్ర నిర్మాణం 
  • అడివి శేష్ తో ఇప్పటికే 'మేజర్' సినిమా
  • తాజాగా విన్న కథలో శర్వానంద్ హీరో 
మహేశ్ బాబు ఓపక్క సినిమాలలో నటిస్తూనే.. మరోపక్క తన అభిరుచి మేర సినిమాలు నిర్మించడానికి కూడా రంగంలోకి దిగిన సంగతి విదితమే. ఇందుకోసం జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను కూడా ఆయన నెలకొల్పారు. ఇప్పటికే తాను నటిస్తున్న చిత్రాలలో ఈ సంస్థ భాగస్వామిగా వుంది. అలాగే అడివి శేష్ హీరోగా 'మేజర్' అనే చిత్రాన్ని కూడా ఈ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో యువ హీరో శర్వానంద్ కూడా మహేశ్ బాబు బ్యానర్ లో ఓ చిత్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల తాను విన్న ఓ కథకు శర్వా అయితే బాగా సూటవుతాడని మహేశ్ భావిస్తున్నాడట. దీంతో ఈ విషయంలో శర్వాతో అప్పుడే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలుస్తోంది. మామూలుగా కథలో కొత్తదనం ఉంటేనే శర్వా సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాడు. ఇది మహేశ్ ఎంచుకున్న కథ కాబట్టి శర్వాకి కూడా నచ్చుతుందని అంటున్నారు.
Sharwanand
Mahesh Babu
GMB Entertainment
Adivi Sesh

More Telugu News