Mahesh Babu: సోఫాపై కూర్చొని సితారతో మహేశ్ ఆట.. నవ్వులు పూయిస్తోన్న వీడియో!

 Mahesh Babu plays  tongue twister game with Sitara
షార్ట్స్‌లో చూడండి
కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కూతురు సితారతో సోఫాపై కూర్చొని 'టంగ్ - ట్విస్టర్' గేమ్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య నమ్రత పోస్ట్ చేసింది. 'ఓడిపోయావ్' అంటూ‌ తండ్రితో సితార వాదించింది.

పలు పదాలు పలకలేక ఇద్దరూ కష్టపడ్డారు. ఆ సమయంలో ఇద్దరు హాయిగా నవ్వుకున్నారు. మహేశ్ అభిమానులను ఈ వీడియో అలరిస్తోంది. ప్రస్తుతం మహేశ్‌ బాబు పరశురామ్‌ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
                  
Go Back to Shorts
Mahesh Babu
sitara
Viral Videos

More Telugu News