జూనియర్ ఎన్టీఆర్ సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిన నభా
- 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో మెరిసిన నభా నటేశ్
- ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రానున్న కొత్త చిత్రం
- ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నభా
త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కోసం నభాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయి పాత్రను నభా పోషించబోతోందట. మరోవైపు ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.