బంధుప్రీతి అన్ని చోట్లా ఉంటుంది... కష్టపడినవాళ్లే స్టార్లు అవుతారు: హీరో నిఖిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంధుప్రీతి అన్ని చోట్లా ఉంటుంది... కష్టపడినవాళ్లే స్టార్లు అవుతారు: హీరో నిఖిల్

Hero Nikhil opines on Nepotism
  • అభిమానులతో నిఖిల్ లైవ్ చాట్
  • బంధుప్రీతి గురించి ప్రశ్నించిన ఫ్యాన్స్
  • తనకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదని వెల్లడి
ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న యువ హీరో నిఖిల్ అభిమానులతో సోషల్ మీడియా లైవ్ చాట్ లో ముచ్చటించారు. బంధుప్రీతి గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, బంధుప్రీతి అన్ని చోట్లా ఉంటుందని అన్నారు. కష్టపడితేనే ఫలితం వస్తుందని, నైపుణ్యం ఉన్నవాళ్లే స్టార్లు అవుతారని స్పష్టం చేశారు.

అయితే, తనకెప్పుడూ ఇండస్ట్రీలో బంధుప్రీతి కారణంగా ఇబ్బందులు కలగలేదని, టాలీవుడ్ తనను నిజంగా అక్కున చేర్చుకుందని వెల్లడించారు. తెలుగు సినీ కుటుంబంలో తాను కూడా ఒకడ్ని అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి తన గురించి మాట్లాడారని, జీవితంలో అదొక గొప్ప సుదినం అని భావిస్తానని నిఖిల్ పేర్కొన్నారు.
Nikhil
Nepotism
Hero
Star
Tollywood

More Telugu News