Samantha: రెండు కుక్కలతో ఆడుకుంటూ... సమంత చూడచక్కని నవ్వులు... వీడియో ఇదిగో!

  • షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన సమంత
  • పెట్ డాగ్స్ తో క్యూట్ వీడియో
  • నెట్టింట వైరల్
Sam Plays with pet dog

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ నిలిచిపోగా, పలువురు సినీ తారలు ఇళ్లలోనే ఉంటూ తాము చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ జాబితాలో అక్కినేని సమంత ముందుందన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా, తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న డాగ్స్ తో సమంత ఆడుకుంటున్న ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. రెండు కుక్కలు, సమంతపై పడి ఆడుకోగా, ఆపై లేచిన ఆమె, చూడచక్కని నవ్వులు చిందించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు. 

More Telugu News