కూతురు, అల్లుడిపై దాడి చేసిన ఏపీ మంత్రి గన్ మేన్

  • మంత్రి తానేటి వనిత వద్ద గన్ మేన్ గా పనిచేస్తున్న చంద్రారావు
  • ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న చంద్రారావు కుమార్తె 
  • నడిరోడ్డుపై కుమార్తెను, అల్లుడ్ని వెంటతరుముతూ కొట్టిన చంద్రారావు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ మంత్రి తానేటి వనిత గన్ మేన్ చంద్రారావు నడిరోడ్డుపై వీరంగం వేశారు. ఇటీవల చంద్రారావు కుమార్తె గాయత్రి ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. అయితే కుమార్తె ప్రేమవివాహం చేసుకుని తన పరువు తీసిందన్న కోపంతో గన్ మేన్ చంద్రారావు నడిరోడ్డుపై దాడికి దిగాడు.

కుమార్తెను, అల్లుడ్ని వెంట తరుముతూ, విచక్షణ రహితంగా కొడుతూ చూపరులకు భయోత్పాతం కలిగించాడు. ఈ ఘటనలో చంద్రారావుపైనా, అతనికి సహకరించిన వ్యక్తులపైనా ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. చంద్రారావు కుమార్తె గాయత్రి 5 నెలల కిందట పోలీసుల సమక్షంలోనే ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి కూతురు అంటే చంద్రారావు మండిపడుతున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Chandrarao
Gun Man
Taneti Vanita
Minister
Eluru

More Telugu News