'మిస్సైల్'గా రానున్న ఎన్టీఆర్?
Add ap7am to your home Screen

'మిస్సైల్'గా రానున్న ఎన్టీఆర్?

NTRs new film titled as Missile
  • టైటిల్ ఎంపిక పెద్ద కసరత్తు 
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్
  • షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం
  • పరిశీలనలో 'మిస్సైల్' అనే టైటిల్  
ఎంతో ఫాలోయింగ్ .. మరెంతో ఇమేజ్ వుండే స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ నిర్ణయించడం అన్నది మామూలు విషయం కాదు. కథకు సూటవ్వాలి.. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలి.. అభిమానులకు క్యాచీగా వుండాలి .. ఇలా టైటిల్ ఎంపికలో చాలా విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.

అందుకే,  స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ నిర్ణయించడానికి చాలా సమయం పడుతుంటుంది. పెద్ద కసరత్తు చేసి, పలు పేర్లు పరిశీలించి చివరికి హీరోగారికి నచ్చే పేరును ఫైనల్ చేస్తారు. ఇక విషయానికి వస్తే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రానికి 'మిస్సైల్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా ఎంతో పాప్యులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఎన్టీఆర్ సమాయత్తమవుతున్నాడు. ప్రశాంత్ చెప్పిన కథకు ఇప్పటికే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వచ్చే ఏడాది ఇది సెట్స్ కి వెళ్లేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి 'మిస్సైల్' అనే పేరుని పరిశీలిస్తున్నారట. కథకు, ఎన్టీఆర్ ఇమేజ్ కు ఇది బాగా సూట్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు.
Jr NTR
KGF
Prashanth Neil

More Telugu News