sitara: ఇంట్లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టేసిన మహేశ్ కూతురు సితార.. వీడియో వైరల్

sitara dance
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కూతురు సితారకు సంబంధించిన మరో డ్యాన్స్ వీడియో ఆయన అభిమానులను అలరిస్తోంది. మహేశ్ భార్య నమ్రత తమ కూతురికి సంబంధించిన ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో సితార డ్యాన్స్ చేసిన తీరు అభిమానులను అబ్బుర పరుస్తోంది.

ఈ వీడియోలో సితార చేతులు, కాళ్లు, నడుము కదిలిస్తూ హీరోయిన్‌లా డ్యాన్స్ చేసింది. తన తండ్రి మహేశ్ బాబు సినిమాలోని పాటలకు డ్యాన్సులు చేసే సితార ఈ సారి మాత్రం హిప్ హాప్ పాట 'బోమ్ డిగ్గీ డిగ్గీ' కి డ్యాన్స్ చేసింది.  సామాజిక మాధ్యమాల్లో చిన్నతనంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న సితారకు సంబంధించిన వీడియోలు మహేశ్ బాబు అభిమానులను అలరిస్తుంటాయి. ఆమె చేసిన ఈ తాజా డ్యాన్స్‌ అద్భుతమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

               
Go Back to Shorts
sitara
Mahesh Babu
Tollywood

More Telugu News