Samantha: సినిమాపై ఆసక్తిని పెంచేస్తోన్న 'పెంగ్విన్' టీజర్.. విడుదల చేసిన స్టార్ హీరోయిన్లు

  • ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పెంగ్విన్
  • హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో సినిమా
  • ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల
  • టీజర్ విడుదల చేసిన సమంత, తాప్సీ, మంజువారియర్, త్రిష
penguin teaser

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'పెంగ్విన్' సినిమాను ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను పలువురు హీరోయిన్లు విడుదల చేశారు. సమంత, తాప్సీ, మంజువారియర్, త్రిష కలిసి తమ సామాజిక మాధ్యమాల ద్వారా పలు భాషల్లోని ఈ టీజర్‌ను విడుదల చేశారు.

ఇటీవ‌లే  విడుదలైన ‘పెంగ్విన్’ ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకంపై కార్తీక్ సుబ్బ‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఈ టీజర్‌ ఆసక్తిని పెంచుతోంది.
   

More Telugu News