నాపై తప్పుడు ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా: కేటీఆర్

KTR response on Green Tribunal notice regarding farm house
  • కేటీఆర్ ఫాంహౌస్ పై ఫిర్యాదు
  • నోటీసు ఇచ్చిన గ్రీన్ ట్రైబ్యునల్
  • ఆ భూమి తనది కాదన్న కేటీఆర్
గండిపేట చెరువుకు ఎగువన ఉన్న జన్వాడ గ్రామంలో జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ ను నిర్మించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ కు గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందించారు.

ఒక కాంగ్రెస్ నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ భూమి తనది కాదని గతంలోనే స్పష్టంగా చెప్పానని అన్నారు. తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని  చెప్పారు. తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలని నిరూపిస్తానని అన్నారు.
Go Back to Shorts
KTR
TRS
Farm House
Green Tribunal

More Telugu News