సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం    
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం    

Anupama walks out of Nikhils movie
  • సీక్వెల్ నుంచి తప్పుకున్న అనుపమ 
  • మాజీ ప్రేమజంట నటించడం లేదట!
  • వెబ్ సీరీస్ లోకి ప్రముఖ దర్శకుడు
*  నిఖిల్ హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఎంచుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, అనుపమ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకుంది. కారణాలు తెలియాల్సి వుంది.  
*  ఒకప్పటి ప్రేమజంట ప్రభుదేవా, నయనతార కలసి మళ్లీ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను తమిళ చిత్ర నిర్మాత ఇషారి గణేశ్ ఖండించారు. వీరిద్దరి కాంబినేషన్ లోనూ తాను చిత్రం నిర్మిస్తున్నట్టు వార్తలొస్తున్నాయనీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తేల్చిచెప్పారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం వెబ్ సీరీస్ ను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. తాను నిర్మాతగా వుండి, దర్శకత్వ బాధ్యతలను మాత్రం వేరే వారికి అప్పగిస్తారట. కాగా, ప్రస్తుతం మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీని తర్వాత 'రోజా' సీక్వెల్ చేస్తారు.
Anupama
Nikhil
Peabhudeva
Nayanatara

More Telugu News