Rashmika Mandanna: ఆ వార్తల్లో నిజం లేదు: రష్మిక

  • హిందీలో రీమేక్ అవుతున్న 'జెర్సీ'
  • ప్రధాన పాత్ర పోషిస్తున్న షాహిద్ కపూర్
  • హీరోయిన్ ఆఫర్ ను తిరస్కరించిన రష్మిక
I have not demanded high remuneration says Rashmika

నాని హీరోగా తెరకెక్కిన 'జెర్సీ' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అయితే, హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలని దర్శకనిర్మాతలు అనుకున్నారట. అయితే, ఈ ఆఫర్ రష్మిక తిరస్కరించింది. ఈ చిత్రం కోసం రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

దీనిపై రష్మిక స్పందిస్తూ, తాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర లోతైన ఎమోషన్స్ ని కలిగి ఉందని... ఆ స్థాయి పాత్రను తాను చేయలేనని తెలిపింది. దీనికి తోడు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం కూడా మరో కారణమని చెప్పారు.

More Telugu News